Share News

ఒండ్రు మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:06 PM

ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఇష్టానుసారంగా ప్రతీ రోజు టిప్పర్ల ద్వార ఒండ్రు మట్టిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండల సభలో ఎంపీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఒండ్రు మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
సమావేశంలో మాట్లాడుత్ను తహసీల్దార్‌ సింధూ

- మండల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీటీసీ సభ్యులు

ధన్వాడ, జూన్‌ 22 : ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఇష్టానుసారంగా ప్రతీ రోజు టిప్పర్ల ద్వార ఒండ్రు మట్టిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండల సభలో ఎంపీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపీ పద్మిబాయి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రు మట్టిని అనుమతికి మించి తరలిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. అనుమతి తీసుకొని ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని తహసీల్దార్‌ సింధూజ మండల సభలో తెలిపారు. గతంలో నాటిన హరితహరంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని మొక్కలు నాటుతున్నారు? అసలు గతంలో నాటిన మొక్కలు ఉన్నాయా? లేదా? చెప్పాలని గున్ముక్ల ఎంపీటీసీ సభ్యుడు సుదీర్‌కుమార్‌ ఏపీవో మొగులయ్యను అడిగారు. గత హరితహరంలో నాటిన మొక్కలు ఇప్పటికీ 75 వేల మొక్కలు ఇంకా బతికే ఉన్నాయన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు విమల, ఎంపీడీవో సాయి ప్రకాష్‌, ఎంపీఈవో వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 11:06 PM