Share News

కేఎల్‌ఐ రాకతో దుందుభీకి పునరుజ్జీవం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

కృష్ణానదికి ఉప నది అయిన దుందుభీ నది గతంలో రెండు మూడేళ్లకు ఒకసారి ప్రవ హించేది.

కేఎల్‌ఐ రాకతో దుందుభీకి పునరుజ్జీవం
తాడూరు మండలం సిర్సవాడ గ్రామం వద్ద కేఎల్‌ఐ నీటితో ప్రవహిస్తున్న దుందుభీ

- కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్‌తో ఆరు నెలలకు పైగా ప్రవహిస్తున్న దుందుభీ

- నది పరివాహక ప్రాంతంలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

- ఆనందంలో అన్నదాతలు

తాడూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదికి ఉప నది అయిన దుందుభీ నది గతంలో రెండు మూడేళ్లకు ఒకసారి ప్రవ హించేది. అది రెండు, మూడు రోజులే. కల్వ కుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) ప్రారం భమైనప్పటి నుంచి ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు ప్రవహిస్తూ అన్నదాతలకు వర దాయినిగా మారింది. గతంలో నదికి కుడి, ఎడమ భాగంలో కిలో మీటరు మేర రైతు లు ఆరుతడి వంటి పంటలు సాగిస్తుండే వారు. ప్రస్తుతం కేఎల్‌ఐ ప్రారంభమై దుందుభీ నదిలో నిత్యం ప్రవాహం కొన సాగుతుండడంతో నదితీరం వెంట భూ గర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగింది. దుందుభీ నది దాదాపు 80కిలో మీటర్ల ప్రవాహం ఉన్నప్పటికీ ప్రస్తుతం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రా మం వద్ద కేఎల్‌ఐ ప్రధాన కాల్వ దుందుభీ నది దాటుతోంది. అక్కడి నుంచే నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, వంగూరు, ఉప్పునుంతల మండలాల్లోని గ్రా మాల మీదుగా ప్రవహిస్తున్న నదికి కేఎల్‌ఐ నీళ్లు సాగుకు పుష్కలంగా లభిస్తున్నాయి. రైతులు నది తీరం వెంట ప్రస్తుతం రెండు పంటలు పండించుకుంటున్నారు. కేఎల్‌ఐ కాల్వల ద్వారా వచ్చిన నీరంతా దుందుభీకి అక్కడకక్కడ కలుస్తుండడంతో నది చెక్‌ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి.

Updated Date - Oct 22 , 2024 | 11:35 PM