మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:23 PM
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
నాగర్‌కర్నూల్/పెద్దకొత్తపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దముద్దు నూర్, పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్, తెల కపల్లి మండలంలోని వట్టిపల్లి గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా శ్రీనిధి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొంది ఏర్పాటు చేసిన వాటిని పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరటికోళ్ల పెంపకాన్ని విస్తృతం గా చేపట్టాలని, గ్రామీణ మహి ళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చే యాలని కలెక్టర్ అధికారులను ఆదే శించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సం స్థ సహకారంతో జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాం కు ద్వారా రుణాలు అందజేసి వారి వ్యా పార యూనిట్ల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నానరు. జిల్లాలో 12రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు అవసరమైన సంపూ ర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నామని మహిళా సంఘాలచే మీ సేవ కేంద్రాలు ఆహార శుద్ధి కేంద్రాలు, పౌలీ్ట్ర యూనిట్ మొద లగు వివిధ వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసిన ట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కలెక్టర్ వెంట శ్రీనిధి అదనపు పీడీ లక్ష్మీనారాయణ, డీపీఎం అరుణాదేవి, డీఆర్‌డీఏ శ్రీనిధి, అధికారులు, మండల స్థాయి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.