మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:52 PM
మహిళా సంఘాల్లో సభ్యులు గా లేని మహిళలకు సభ్యత్వం చేయించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
నాగర్‌కర్నూల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మహిళా సంఘాల్లో సభ్యులు గా లేని మహిళలకు సభ్యత్వం చేయించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ గ్రామీణాభి వృద్ధి సంస్థ మహిళా సాధికారత దిశగా చేపడుతున్న వివిధ రకాల ప్రభుత్వ పథకాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, వారి కోసం రుణా లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియో గం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఒక ఇంట్లో ఒక మహిళ ఆర్థి కంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ఈ ఆర్థిక సంవ త్సరం 2024-25 లక్ష్యాలను వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా, త్వరితగతిన పూర్తి చే యాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి చిన్న ఓబులేష్, అదనపు పీడీ రాజేశ్వరి, డిప్యూటీ సీఈవో పాల్గొన్నారు.