విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:31 PM
విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు.
నారాయణపేట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. తొమ్మిది నెలలు శిక్షణ పూర్తి చేసుకొని కొత్తగా విఽధుల్లో చేరుతున్న 78 మంది కానిస్టేబుళ్లలో 47 మంది సివిల్ కానిస్టేబుల్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు 31 మందికి సోమవారం జిల్లా పోలీస్ కా ్యాలయంలో పోసింగ్‌లు ఇ చ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు శంకర్‌లాల్, రామ్‌లాల్, నరసింహ, శివశంకర్, రాములు ఉన్నారు.
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
జిల్లా వ్యాప్తంగా ఈనెల 31 వరకు నెలరోజుల పాటు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేష్‌గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమా వేశాలు, బహిరంగ సభలు నిర్వహించొద్దన్నారు.