Telangana: రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ABN , Publish Date - Nov 26 , 2024 | 06:01 PM
గూడూరు టోల్ ప్లాజా వద్ద నిషేధిత ఎఫెడ్రిన్ మత్తు పదార్థాలను పోలీసులు తనిఖీల్లో భాగంగా సోమవారం భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ క్రమంలో శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేసినట్లు వారు తెలిపారు.
యాదాద్రి, నవంబర్ 26: తెలంగాణలో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసినట్లు భవనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. మంగళవారం భువనగిరిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ నార్కిటిక్ బ్యూరో, రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో 120 కిలోల నిషేధిత ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ. 24 కోట్లు ఉంటుందని చెప్పారు.
Also Read:సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ఈ కేసును సంబంధించి నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్ (ముంబై)తోపాటు డ్రైవర్ చెపురి సునీల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే రెండు హ్యుందాయ్, వర్ణ కార్లతోపాటు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అయితే వాసుదేవచారి, భాను ప్రసాద్, సల్మాన్ షేక్ డోల (ముంబై), సత్యనారాయణ (కెమిస్ట్) తదితరులు పరారీలో ఉన్నారన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గాలింపు చేపట్టినట్లు చెప్పారు.
Also Read రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
సోమవారం గూడూరు టోల్ ప్లాజా వద్ద నిషేధిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాలను పోలీసులు తనిఖీల్లో భాగంగా భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ క్రమంలో శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేసినట్లు వారు తెలిపారు.
Also Read: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
Also Read: మున్సిపల్ కమిషనర్ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీలో భారీ పోలీసు బలగాల మధ్య సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 120 కేజీల మత్తు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం రామోజీ పేట్ శివారులో యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమను మూసి వేశారు. అయితే దానిని కేంద్రంగా చేసుకుని.. డ్రగ్స్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు పోలీసుల సోదాల్లో గుర్తించారు.
For Telangana News And Telugu News