టపాసులు కాలుస్తుండగా బాల కార్మికుడికి గాయాలు
ABN , Publish Date - Sep 24 , 2024 | 11:06 PM
శివ్వంపేట, సెప్టెంబరు 24: పంటను కోతులు, పిట్టల బెరద నుంచి రక్షించేందుకు టపాసులు కాలుస్తుండగా బాల కార్మికుడి చేతికి గాయాలయ్యాయి.
శివ్వంపేట, సెప్టెంబరు 24: పంటను కోతులు, పిట్టల బెరద నుంచి రక్షించేందుకు టపాసులు కాలుస్తుండగా బాల కార్మికుడి చేతికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్యపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగయ్యపల్లిలోని ఆర్‌ఎన్‌డీఏ విత్తన పరిశ్రమలో యశ్వంత్(16) పనిచేస్తున్నాడు. అయితే పరిశ్రమ యాజమాన్యం కోతుల, పిట్టల బెడద నుంచి పంటను రక్షించేందుకు సుతిలి బాంబు టపాసులు కాల్చమని యశ్వంత్‌ను ఆదేశించారు. అతడు బాంబులు కాలుస్తుండగా చేయికి నిప్పు తగిలి గాయాలయ్యాయి. దీంతో పరిశ్రమ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా యశ్వంత్‌ను ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపించారు. బాల కార్మికుడితో పని చేయించడమే కాకుండా.. టపాసులు కాల్పించిన పరిశ్రమ యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.