Share News

నూతన పెన్షన్‌ రద్దుకు మరో ఉద్యమం

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:19 PM

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 1: నూతన పెన్షన్‌ విధానం రద్దుకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు టీఎన్జీవో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ పేర్కొన్నారు.

నూతన పెన్షన్‌ రద్దుకు మరో ఉద్యమం
మెదక్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఐక్య కార్యాచరణ సమితి ఉద్యోగులు

టీఎన్జీవో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌

సీపీఎ్‌సను రద్దు చేయాలని నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగ సంఘాల నిరసన

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 1: నూతన పెన్షన్‌ విధానం రద్దుకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు టీఎన్జీవో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ పేర్కొన్నారు. పెన్షన్‌ విద్రోహ దినంగా పరిగణిస్తూ.. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌ మాట్లాడుతూ నూతన పెన్షన్‌ విధానం అమలైన 20 ఏళ్లల్లో సీపీఎస్‌ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంతేకాకుండా పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు భద్రతనిచే పెన్షన్‌ లేకపోవడంతో చాలామంది విశ్రాంత సీపీఎస్‌ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా పాత పెన్షన్‌ విధానం అమలులోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో టీపీటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, టీఎన్జీవో, ట్రెసా, పీఆర్టీయూ, తపస్‌, టీపీటీఎఫ్‌, ఎస్టీయూ, యూటీఎఫ్‌, టీటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజ్‌కుమార్‌, మహేందర్‌గౌడ్‌, సుంకరి కృష్ణ, ఎల్లం, సంగయ్య, రాజ్‌గోపాల్‌గౌడ్‌, పద్మరావు, శివయ్య, సత్యనారాయణ, వివిధ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లారెడ్డి, చంద్రశేఖర్‌, హీరాలాల్‌, సత్యనారాయణరెడ్డి, ఫణిరాజ్‌, ఫజులొద్దీన్‌, నగేష్‌, శివరాం, గోపాల్‌, రామాగౌడ్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌: పెన్షన్‌ విద్రోహ దినోత్సవం సందర్భంగా ఆదివారం నర్సాపూర్‌ మండల విద్యాధికారి కార్యాలయం వద్ద వర్షంలోనే ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అఽధ్యక్షుడు శ్రీనివా్‌సరావు మాట్లాడుతూ 2004 నుంచి అమలవుతున్న నూతన పెన్షన్‌ వల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాకియా, నాగుర్‌మీరా, రమే్‌షరాజు, శివకమార్‌, అప్పలనాయుడు, భాస్కర్‌, శ్రీహరి, పెంటయ్య, నరేందర్‌, శ్రీహరి, కృష్ణ, శ్రీనివసరావు, రాములు పాల్గొన్నారు.

ఉద్యోగుల పాలిట శాపంగా ‘సీపీఎస్‌’

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 1: ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ చైర్మన్‌ జావిద్‌అలీ, కో చైర్మన్‌ వైద్యనాథ్‌ డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు వర్షాన్ని లెక్కచేయకుండా నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీ నిరసన ప్రదర్శన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్‌ విధానం రద్దు హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, పీఆర్‌సీ వేతన సవరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నాయకులు వై.అశోక్‌కుమార్‌, సాబేర్‌అలీ, వి.రవి, సుధామణి పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

సిద్దిపేట కల్చరల్‌, సెప్టెంబరు 1: కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకుడు గ్యాదరి పరమేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించేంత వరకు అన్ని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలను కలుపుకొని ఐక్యపోరాటం చేస్తామన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 1న పెన్షనర్ల విద్రోహ దినమని తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్‌, శశిధరశర్మ, రాజేశం, యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 11:19 PM