సీఎం రేవంత్‌రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి
ABN , Publish Date - Feb 07 , 2024 | 12:03 AM
సీఎం రేవంత్‌రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: సీఎం రేవంత్‌రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. అలాగే పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బాల్క సుమన్‌కు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసే స్థాయి లేదన్నారు. ఎంతో మంది ఉద్యమకారులను మభ్యపెట్టి బాల్క సుమన్ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. సీఎంకు క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే కాంగ్రె్‌స పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.