చిరుత దాడిలో లేగదూడ మృతి
ABN , Publish Date - Jul 02 , 2024 | 11:15 PM
చేగుంట, జూలై 2: చిరుతదాడిలో లేగదూడ మృతిచెందిన సంఘటన చేగుంట మండలం రాంపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్నది.
చేగుంట, జూలై 2: చిరుతదాడిలో లేగదూడ మృతిచెందిన సంఘటన చేగుంట మండలం రాంపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ అటవీ ప్రాంతంలోని తన వ్యవసాయ పొలాల వద్ద పాకలో పశువులను కట్టేశాడు. మంగళవారం ఉదయం వచ్చిచూసేసరికి దూడ లేకపోవడంతో పాటు పశువుల పాక చుట్టూ రక్తం, ఎముకల మాంసం ఉండడంతో అటవీ అధికారులు సమాచారం అందించాడు. తూప్రాన్ అటవీ సెక్షన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ గ్రామానికి చేరుకుని పశువుల పాక చుట్టూ పాదాల గుర్తుల ఆధారంగా వెళ్లారు. సమీప అటవీ ప్రాంతంలోని కుంటకట్ట దగ్గర పొదల్లో లేగదూడ మృతదేహం కనిపించింది. లేగదూడపై దాడి, పాదాల గుర్తులు, చిరుత ఆనవాళ్లేనని తెలిపారు. అనంతరం లేగదూడ మృతదేహానికి పశువుల డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల రైతులు వ్యవసాయ పొలాల వద్ద పశువులను కట్టేయొద్దని, రాత్రివేళలో పొలానికి వెళ్లొదని సెక్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ సూచించారు.