Share News

మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:48 PM

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి

 మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య
రైతువేదికలో మాట్లాడుతున్న నర్సారెడ్డి

గజ్వేల్‌, ఆగస్టు 24: ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి విమర్శించారు. గజ్వేల్‌ పట్టణంలోని రైతువేదికలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రాహుల్‌గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటామని, ఇప్పటికే రూ. 17వేల కోట్ల రుణమాఫీ చేశామని, మరో రూ.14వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరుగలేదని, వారందరి వివరాలను సేకరించి త్వరలోనే ప్రతీ రైతు రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. గజ్వేల్‌లో రుణమాఫీ విషయంలో పలువురు నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ గతంలో రుణాలను మాఫీ చేయడంలో విఫలమయ్యారని, మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్‌ ప్రజలను కేసీఆర్‌ ఎందుకు కలువట్లేదని ప్నశించారు. పదేళ్లు సీఎంగా ఉండి కూడా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డును పూర్తి చేయించలేదని దుయ్యబట్టారు. సిద్దిపేట పట్టణంలో బస్టాండ్‌ కూల్చివేస్తే నాలుగు నెలల్లో పూర్తి చేశారని, గజ్వేల్‌లో ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. ఆయనవెంట డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:48 PM