Share News

కరప్షన్‌ కింగ్‌ సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:01 AM

పది మాసాల్లో రూ.90వేల కోట్ల అప్పు హైడ్రాను ఉపసంహరించుకోవాలి బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతా్‌పరెడ్డి

కరప్షన్‌ కింగ్‌ సీఎం రేవంత్‌రెడ్డి
గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌లో మైనంపల్లి హనుమంతరావుపై ఫిర్యాదు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

గజ్వేల్‌, అక్టోబరు 3: రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కరప్షన్‌ కింగ్‌లా మారారని గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతా్‌పరెడ్డి ఆరోపించారు. గజ్వేల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదాయాన్ని పెంచుతా-ప్రజలకు పంచుతానన్న రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలయ్యాయని, పది నెలల కాలంలో రూ.90వేల కోట్ల అప్పును తీసుకువచ్చారన్నారు. పది నెలల్లో ఒక్క స్కీం లేదని, ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదన్నారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో డబ్బులు దండుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మూసీ నదికి కిలోమీటర్‌కు రూ.170 కోట్లు ఖర్చు అయితే, ఈ ప్రభుత్వంలో కిలోమీటర్‌కు రూ.2700 కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని విస్మరించారని, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, వైద్యారోగ్యశాఖ పూర్వ స్థితికి చేరుకుందని, ‘నేను రాను బిడ్డో సర్కారు దావఖానాకు’ అని ప్రజలు అంటున్నారన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, పిల్లలు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మహిళలోకం తలదించుకునేలా ఉన్నాయన్నారు. అనంతరం గజ్వేల్‌ పోలీ్‌సస్టేషన్‌లో మైనంపల్లిపై ఫిర్యాదు చేశారు. వారితో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌.సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకియోద్దీన్‌, నాయకులు శ్రీనివాస్‌, రమేష్‌, ఉప్పల మెట్టయ్య, బెండే మధు, మద్దూరు శ్రీనివా్‌సరెడ్డి, వెంకన్నగారి దయాకర్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, బబ్బురి రజిత, శ్రీనివాస్‌, రాజు, ఉమర్‌, బొగ్గుల చందు ఉన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 12:01 AM