కోహెడలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:39 PM
తొలగించాలని ఏఈకి బీజేపీ నాయకుల వినతి
కోహెడ, జూలై 31: విద్యుత్ తీగలకు చెట్టు కొమ్మలు తగిలి మంటలు వస్తున్నాయని కోహెడ, కూరెళ్ళ గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషన్ వెనుక ఉన్న కాలనీలోని ఇళ్లపై 11 కేవీ విద్యుత్ తీగలు వేలాడుతుండడంతో గాలి వీచినప్పుడల్లా మంటలు వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు కరెంటు స్తంభం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ విద్యుత్ ప్రసరన జరుగుతున్నదని లైన్‌మన్, సంబంధిత శాఖ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కోహెడ మండల కేంద్రంలో ఇళ్ల మీదుగా ఉన్న కరెంటు వైర్లు తొలగించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ శ్రేణులతో కలిసి ఏఈ రవీందర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రామంచ రాంచంద్రరెడ్డి, బీజేపీ నాయకులు కొండబత్తిని సతీష్, మామిడి కరుణాకర్ , బండ సుమన్‌యాదవ్, ముంజ సాగర్, శ్రీకాంత్, ఎడ్ల రాజు, రవి ఉన్నారు.