దాశరథి నేటి యువతకు స్ఫూర్తి
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:41 PM
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 21: నవయుగ వైతాళికుడు దాశరథి నేటి యువతకు స్ఫూర్తి అని ప్రముఖ సినీ గేయ కవి సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు.
ప్రముఖ సినీ గేయ కవి సుద్దాల అశోక్‌తేజ
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 21: నవయుగ వైతాళికుడు దాశరథి నేటి యువతకు స్ఫూర్తి అని ప్రముఖ సినీ గేయ కవి సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ మహాకవి ‘దాశరథి జీవితం-సాహిత్యం సమాలోచనలు’ అనే అంశంపై కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ నిజాం సర్కార్ ద్వారా శిక్షించబడి, అనంతరకాలంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహాకవి దాశరథిని ఆస్థాన కవిగా చేసి ప్రభుత్వం గౌరవించిందన్నారు. దాశరథి వ్యక్తిత్వం, జీవితం, సాహిత్యాల గురించి జమిలీగా ప్రసంగిస్తూ ఉద్యమ కవిగా, ప్రబోధ కవిగా, శృంగార కవిగా దాశరథిలోని పలు పార్శ్వాలను స్పృశిస్తూ సభకు హాజరైన విద్యార్థుల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని అద్భుతంగా ప్రసంగించారు. అనంతరం తెలుగు సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో దాశరథి జీవితంపై కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రత్నప్రసాద్, డా.నాలేశ్వరం శంకరం, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.