ఉపాధ్యాయుల విడుదలలో జాప్యాన్ని నివారించాలి
ABN , Publish Date - Jul 17 , 2024 | 11:26 PM
టీఎ్‌సయూటీఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ
సిద్దిపేట టౌన్, జూలై17: బదిలీ అయిన ఎస్జీటీ ఉపాధ్యాయుల విడుదలలో జాప్యాన్ని నివారించాలని టీఎ్‌సయూటీఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు బుధవారం సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డికి వివిధ అంశాలపై వినతిపత్రం అందజేసి, పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ వలీ అహ్మద్, ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని, కొన్ని మండలాల్లో మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సమన్వయం లోపం కారణంగా, కొంతమంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ విడుదల కాకుండా అదే పాఠశాలలో పనిచేయాల్సి వస్తున్నదని విమర్శించారు. బదిలీ అయినా ప్రయోజనం లేకుండా పోయిందని కొంతమంది ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఉపాధ్యాయులు, పాఠశాల వివరాలు డీఈవోకు అందజేసినట్లు చెప్పారు. విడుదలలో జాప్యాన్ని నివారించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డీఈవోకు తెలియజేశామన్నారు. పదోన్నతులు, బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల వివరాలను తెలియజేయాలని, డీఈవోను కోరినట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరుకి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సి. చంద్రారెడ్డి, చిర్ర యాదగిరి, ఎం. కృష్ణ, కే. కనకరాజు, జి. వెంకటకిరణ్, ప్రశాంత్‌కుమార్, టి. శివలింగం, ఎస్. వెంకటేశం, సీహెచ్. రామచంద్రం, ఎండీ. సాబీర్, బి. రాజేందర్, యాదయ్య, కే. శ్రీనివాస్, డి. రాజలింగం, జి. బిక్షపతి, వై. శ్రీనివాస్, కే. నరసింహులు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.