Share News

నులిపురుగుల నివారణకే ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:21 PM

ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి

నులిపురుగుల నివారణకే ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ
ప్రజ్ఞాపూర్‌లో విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి

గజ్వేల్‌, జూన్‌ 20: నులిపురుగుల నివారణకే అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ చేస్తున్నట్లు శాసనమండలి సభ్యులు వంటేరి యాదవరెడ్డి అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలను మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళితో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగాయ ఆయన మాట్లాడుతూ.. కడుపులో ఉన్న నులిపురుగుల నివారణకు ఈ అల్బెండజోల్‌ మాత్రలు పనిచేస్తాయని, జిల్లాలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సున్న పిల్లలందరికీ ఈ మాత్రలను వేయించాలన్నారు. ఆయనవెంట జడ్పీటీసీ పంగ మల్లేశం, కౌన్సిలర్లు అర్చన శివకుమార్‌, వైద్యాధికారి బల్బీర్‌సింగ్‌, ఖాసీం, అనిత, సుజాత, వాసుదేవ్‌, రమేశ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 11:21 PM