Share News

ఐడీఎ్‌సఎంటీ ఫేజ్‌-2కు న్యాయం చేయండి

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:38 PM

మెదక్‌ మున్సిపాలిటీ, ఆగస్టు 31: చిన్న, మధ్యస్థ పట్టణాల సమగ్ర అభివృద్ధి (ఐడీఎ్‌సఎంటీ) ఫేజ్‌-2 బాధితులకు న్యాయం చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

ఐడీఎ్‌సఎంటీ ఫేజ్‌-2కు న్యాయం చేయండి
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు

ఆందోళనకు దిగిన దరఖాస్తుదారులు

ఈనెలాఖరులోగా పరిష్కరిస్తామన్న చైర్మన్‌ చంద్రపాల్‌

మెదక్‌ మున్సిపాలిటీ, ఆగస్టు 31: చిన్న, మధ్యస్థ పట్టణాల సమగ్ర అభివృద్ధి (ఐడీఎ్‌సఎంటీ) ఫేజ్‌-2 బాధితులకు న్యాయం చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. శనివారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం జరిగిన అనంతరం చైర్మన్‌ చంద్రపాల్‌, పాలకవర్గాన్ని వారు కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఫేజ్‌ -1లో స్థలాలు దక్కని వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు దిగారు. ఎన్నోఏళ్లుగా తమకు స్థలాలు కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేజ్‌-1లో 21 మందికి పైగా, ఫేజ్‌-2లో 40 మందికి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉందన్నారు. కొన్నిరోజులుగా తామంతా ఏకమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. నేడు కౌన్సిల్‌ సమావేశమున్నందున కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. సమావేశం ముగియగానే చైర్మన్‌ కలిసి తమ సమస్యను తెలియజేశామన్నారు. తమకు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని కోరగా చైర్మన్‌ స్పందిస్తూ తామంతా అదే పనిలో ఉన్నామని, ఈనెలాఖరులోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు హామీఇచ్చారని తెలిపారు.

Updated Date - Aug 31 , 2024 | 11:38 PM