సీతానగర్ తండాకు తాగునీటి అవస్థలు
ABN , Publish Date - Jul 25 , 2024 | 11:07 PM
అల్లాదుర్గం, జూలై 25 : అధికారుల నిర్లక్ష్య ఫలితంగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాదుర్గం మండలం సీతానగర్ గిరిజన తండా వాసులు అల్లాడుతున్నారు
అల్లాదుర్గం, జూలై 25 : అధికారుల నిర్లక్ష్య ఫలితంగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాదుర్గం మండలం సీతానగర్ గిరిజన తండా వాసులు అల్లాడుతున్నారు తండాకు సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీరు నాలుగు రోజులుగా నిలిచిపోయింది. దీనికి తోడుగా రెండు రోజుల క్రితం తండా సమీపంలో విద్యుత్ తీగ తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. తండాలో ఉన్న ఒకే ఒక్క సింగల్ ఫేజ్ బోరు మోటారు పనిచేయడం లేదు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాహం తీర్చుకునేందుకు పక్క మండలమైన పెద్దశంకరంపేట పరిధిలోని వెంకటాపూర్ శివారులోని వ్యవసాయ క్షేత్రాల నుంచి నీటి తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొన్నది. ఓ వైపు వర్షం, మరో వైపు నీటి ఎద్దడితో అష్టకష్టాలు పడుతు చేను గట్టుల మీదుగా తాగు నీటిని తెచ్చుకుంటున్నాని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తండాలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.