Share News

ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:00 AM

యూఎ్‌సఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి

ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

గజ్వేల్‌, ఆగస్టు 29: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని యూఎ్‌సఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి డిమాండ్‌ చే శారు. స్కాలర్‌షి్‌పలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గజ్వేల్‌ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకి పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజ్‌రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా విద్య రంగ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలన్నారు. ధర్నా అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో యూఎ్‌సఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుడికందుల రవి, చంద్లపురం మధు, రాష్ట్ర కమిటీ సభ్యుడు నాచారం శేఖర్‌, డివిజన్‌ నాయకులు వేముల ప్రవీణ్‌, తిమ్మాపురం యాదగిరి, సింగాటం రంజిత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:00 AM