Share News

Hairsh Rao: అన్నింటిలో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. హరీష్‌ విసుర్లు

ABN , Publish Date - Nov 21 , 2024 | 02:33 PM

Telangana: రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారన్నారు. మరోపక్క సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రకటించడం పట్ల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

Hairsh Rao: అన్నింటిలో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. హరీష్‌ విసుర్లు
Former Minister Harish Rao

సంగారెడ్డి జిల్లా, నవంబర్ 21: సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు (former Minister Harish Rao) ఘాటు విమర్శలు చేశారు. గురువారం అందోల్ మండలం మాసాన్ పల్లీ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారని.. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగారా అంటూ విమర్శలు గుప్పించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.

KTR: వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న కేటీఆర్


రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారన్నారు. మరోపక్క సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రకటించడం పట్ల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మధ్యలో 20 లక్షల మెట్రో టన్నుల ధాన్యం ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన సగం ధాన్యం దళారుల పాలయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.


దళిత గిరిజన అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని విమర్శించారు. కంపెనీ నిర్మాణాల కోసం ఆ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం తెరలేపుతున్నారన్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని తెలిపారు.

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది


పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర రేవంత్ ది అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ‘‘ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను కబ్జాలో ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు రా రేవంత్ రెడ్డి. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం’’ అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఎన్ని బ్లాక్ మెయిల్ చేసిన భయపడేది లేదని.. బీఆర్‌ఎస్ పార్టీ తరపున రైతుల పక్షాన రేవంత్‌ను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

పీఏసీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ

షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 02:36 PM