Share News

హాల్‌ మార్కింగ్‌ ఆభరణాలే కొనాలి

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:33 PM

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 6: భారతీయ ప్రమాణాల బ్యూరో నిర్ధారించిన హాల్‌ మార్కింగ్‌ ఉన్న ఆభరణాలు మాత్రమే కొనాలని బీఐఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌, శాస్త్రవేత్త సవిత సూచించారు.

హాల్‌ మార్కింగ్‌ ఆభరణాలే కొనాలి
సంగారెడ్డిలో నిర్వహించిన అవగాహన సదస్సులో బీఐఎస్‌ అధికారులు, సిబ్బంది

బీఐఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌, శాస్తవేత్త సవిత

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 6: భారతీయ ప్రమాణాల బ్యూరో నిర్ధారించిన హాల్‌ మార్కింగ్‌ ఉన్న ఆభరణాలు మాత్రమే కొనాలని బీఐఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌, శాస్త్రవేత్త సవిత సూచించారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బీఐఎస్‌ ఆధ్వర్యంలో బంగారం వర్తక వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు, వినియోగదారులకు హాల్‌ మార్కింగ్‌పై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు ఆభరణాల శుద్ధతను నిర్ధారించేందుకు భారత ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్న జిల్లాలో ఈ విధానాన్ని తప్పనిసరి చేసిందన్నారు. ప్రస్తుతానికి జిల్లాలో హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి కాకపోయినా తయారీదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీఐఎస్‌ లైసెన్సులు పొందాలని సూచించారు. వినియోగదారులకు శుద్ధమైన ఆభరణాలు అందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని కోరారు. నాణ్యత పొందడం వినియోగదారుల హక్కు అని, ప్రతిఒక్కరూ విధిగా తమ పాత్ర పోషించాలన్నారు. ప్రతి వస్తువుపై ఐఎ్‌సఐ మార్కు, బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌, ఎలకా్ట్రనిక్‌ వస్తువులపై రిజిస్ట్రేషన్‌ మార్కు విధిగా చూడాలని, ఈ ముద్రలు కనిపించకపోతే బీఐఎస్‌ కేర్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు అందించాలని తెలిపారు. ఫిర్యాదు అందితే సంబంధిత తయారీ సంస్థలపై బీఐఎస్‌ చర్యలు చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఐఎస్‌ హాల్‌ మార్కింగ్‌ ఏజెంట్‌ ప్రశాంతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 11:33 PM