Share News

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ వేదిక

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:48 PM

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 28: పెండింగ్‌ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పేర్కొన్నారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ వేదిక
రోడ్డు ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్‌ పత్రాలను అందజేస్తున్న సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి

సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి

5,301 కేసులు పరిష్కారం

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 28: పెండింగ్‌ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో ఆమె ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులు, పెండింగ్‌ కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు ఒకేసారి లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృథా కాకుండా పోతుందని తెలిపారు. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక అదాలత్‌లో 5,240 క్రిమినల్‌ కేసులను, 61 సివిల్‌ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. 27 రోడ్డు ప్రమాదం కేసుల్లో బాధితులకు రూ.2,52,7000 ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి డబ్బులను అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి స్వాతిరెడ్డి, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి మిలింద్‌ కాంబ్లే, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి చందన, అడిషనల్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రావణి, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జనార్దన్‌రెడ్డి, న్యాయవాదులు రవీందర్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:48 PM