Share News

రేపటి నుంచే ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:13 PM

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 1: జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

రేపటి నుంచే ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 1: జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 9వ తేదీవరకు జరిగే ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన కేంద్రాలు, సిబ్బందిని నియమించారు. ఎస్‌ఎ్‌ససీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరగనున్నది. సంగారెడ్డిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్ష జరగనున్నది. 319 మంది పదో తరగతి, 733 మంది ఇంటర్మీడియట్‌ పరీక్ష రాయనున్నారు. రెగ్యులర్‌ పరీక్షలతో సమానంలో ఓపెన్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యాసకులు తగు సూచనలు పాటించాల్సి ఉంటుంది. గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, 5 నిమిషాల తర్వాత లోనికి అనుమతించరని, ఎలాంటి నిషేధిత మెటీరియల్స్‌ హాల్‌లోకి అనుమతించరని డీఈవో వెంకటేశ్వర్లు, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ వెంకటస్వామి తెలిపారు. సమాచారం కోసం 08455-276434, 8008403635 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.

Updated Date - Oct 01 , 2024 | 11:13 PM