కష్టపడ్డ వారికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 08 , 2024 | 10:57 PM
సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ
సిద్దిపేట టౌన్, సెప్టెంబరు 8: కష్టపడ్డ వారికి కాంగ్రె్‌సలో ప్రాధాన్యం ఉంటుందని ఆ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహే్‌షకుమార్‌గౌడ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో శనివారం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహే్‌షకుమార్‌గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, మున్సిపల్ కౌన్సిలర్ రియాజుద్దీన్, నాయకులు ముద్దం లక్ష్మి, కలీమొద్దీన్, సాకి ఆనంద్, బుచ్చిరెడ్డి, ఎల్లం యాదవ్, తప్పట శంకర్, గుర్రం అంజిరెడ్డి, మంద పాండు, గోపికృష్ణ, శాబు, మిద్దె రవి, సాంబమూర్తి, చెంది శ్రీనివాస్, ఎర్రబోలు రాజిరెడ్డి, రాజేష్ ఖన్నా, అర్షద్, వాహబ్, అజ్మత్, మెరుగు రాజు, కొడారి మల్లారెడ్డి, వనజ, కవిత, జనార్దన్‌రెడ్డి, బొంగోని శ్రీనివా్‌సగౌడ్, దుర్గయ్య, రాజమహమ్మద్, దుర్గాప్రసాద్, బాబు, నవీన్, వంశీ, అరవింద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.