స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:24 PM
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్, జూలై 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డిల అమరుల భవనంలో శుక్రవారం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐకి ఉందని, ఇంతటి ఘనచరిత్ర కలిగిన సీపీఐని గ్రామగ్రామాన బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, జాగీర్ సత్యనారాయణగౌడ్, ఎడల వనేష్, కొమ్ముల భాస్కర్, అయిలేని సంజీవరెడ్డి, కొయ్యడ కొంరయ్య, గూడ పద్మ, జేరిపోతుల జనార్ధన్, మల్లారెడ్డి తదితరులున్నారు.