విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
ABN , Publish Date - Jul 23 , 2024 | 11:53 PM
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి
సిద్దిపేట టౌన్, జూలై23: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి నిర్వాహకులకు సూచించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో సిబ్బందితో కలిసి పర్యటించారు. పట్టణంలోని 6వ వార్డులోని వర్మీ కంపోస్టుయార్డులో తడి చెత్త ద్వారా ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఎరువును ఎప్పటికప్పుడు విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. బాలికల ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా నిర్మించిన మూత్రశాలలను, నీటి ట్యాప్ ఏర్పాట్లను, విద్యుత్ పనులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ.. రోజు పాఠశాలకు వస్తున్నారా, మధ్యాహ్న భోజనం బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. వంటశాలలో భోజన తయారీని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈలు రంజిత్, అన్వే్‌షరెడ్డి, టీపీవో దేవరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సతీష్, వనిత, మాధవి, నాయకులు పయ్యావుల పూర్ణిమ ఎల్లం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని వార్డు నెంబర్ 17, 19, 20, 21, 36, 37లలో నేడు మున్సిపల్ తాగునీరు సరఫరా బంద్ చేస్తున్నట్లు కమిషనర్ ప్రసన్నరాణి ఒక ప్రకటనలో తెలిపారు.