పరిశ్రమ నుంచి మా గ్రామాన్ని కాపాడండి
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:12 PM
మనోహరాబాద్, అక్టోబరు 1: ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ నుంచి గ్రామాన్ని కాపాడాలని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
మెదక్ కలెక్టర్‌కు రంగాయపల్లి గ్రామస్థుల వినతి
మనోహరాబాద్, అక్టోబరు 1: ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ నుంచి గ్రామాన్ని కాపాడాలని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 2004లో ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేశారన్నారు. గతంలో కొద్దిమేర ఉన్న పరిశ్రమ ప్రస్తుతం 25 ఎకరాలకు విస్తరించిందన్నారు. పరిశ్రమ గ్రామాన్ని ఆనుకుని ఉండడంతో రాత్రివేళల్లో శబ్దాలు, దుమ్ము, ధూళిని ఇష్టానుసారంగా వదులుతున్నారని చెప్పారు. ఈ విషయమై సోమవారం పరిశ్రమ ఎదుట ఆందోళన కూడా చేశామని పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 30 టన్నుల బట్టీ ఉండగా.. అధిక ఉత్పత్తి కోసం 200 టన్నుల బట్టీని నిర్మిస్తున్నారన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మా గ్రామాన్ని కాపాడాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చందర్‌గౌడ్, వెంకటేష్, శ్రీశైలం, మహేష్, మహిళలు పాల్గొన్నారు.