Share News

సీతారాం ఏచూరి మరణం తీరని లోటు

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:58 PM

గజ్వేల్‌/చేర్యాల/మద్దూరు/సిద్దిపేట అర్బన్‌/మర్కుక్‌/హుస్నాబాద్‌, సెప్టెంబరు 14: సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వలిఅహ్మద్‌, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ అన్నారు.

సీతారాం ఏచూరి మరణం తీరని లోటు
గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించిన సంతాప సభలో నివాళులర్పిస్తున్న నాయకులు

గజ్వేల్‌/చేర్యాల/మద్దూరు/సిద్దిపేట అర్బన్‌/మర్కుక్‌/హుస్నాబాద్‌, సెప్టెంబరు 14: సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వలిఅహ్మద్‌, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ అన్నారు. సీతారాం ఏచూరి సంతాప సభను ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రంగారెడ్డి, వెంకటాచారి, అఫ్జల్‌ పాల్గొన్నారు. కొమురవెల్లి మండలం మర్రి ముత్యాల గ్రామంలో సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యులు, నక్కల యాదవరెడ్డి, బద్దిపడిగె కృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, మైపాల్‌ బాల్‌రాజ్‌, దుర్గయ్య, సత్తయ్య తదితరులు నివాళులర్పించారు. మద్దూరు మండల కేంద్రంలోని తాజ్‌గార్డెన్‌లో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నారదాసు కనకయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఏచూరి సంతాప సభలో మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి మాట్లాడారు. సిద్దిపేటలో ఏచూరి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు. ఈ సంతాప సభలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలస్వామి, సీనియర్‌ నాయకులు నక్కల యాదవరెడ్డి, సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో మర్కుక్‌ మండల కేంద్రంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సందబోయిన ఎల్లయ్య, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, మర్కుక్‌ మాజీ సర్పంచ్‌ నరసింహులు మాట్లాడారు.

పేదల పక్షాన నిలిచిన ‘ఏచూరి’

హుస్నాబాద్‌, సెప్టెంబరు 14: సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి పేదలకు తీరనిలోటని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే పేదల పక్షాన ఉంటూ పోరాడిన నాయకుడని కొనియాడారు.

Updated Date - Sep 14 , 2024 | 10:58 PM