Share News

ఐఐటీహెచ్‌లో అంతరిక్ష దినోత్సవం

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:17 PM

కంది, ఆగస్టు 24: ఇస్రో చంద్రయాన్‌-3 చంద్రుడిపై దింపిన ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.

ఐఐటీహెచ్‌లో అంతరిక్ష దినోత్సవం

ప్రారంభించిన ఇస్రో మాజీ సీనియర్‌ సైంటిస్ట్‌

ఆకట్టుకున్న అంతరిక్ష చిత్రాల ఎగ్జిబిషన్‌

రాష్ట్రవ్యాప్తంగా 424 పాఠశాలల విద్యార్థులు హాజరు

కంది, ఆగస్టు 24: ఇస్రో చంద్రయాన్‌-3 చంద్రుడిపై దింపిన ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా శనివారం ప్రాంగణంలో అంతరిక్ష చిత్రాలతో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఇస్రో మాజీ సీనియర్‌ సైంటిస్ట్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ డాక్టర్‌ కే.మృత్యుంజయరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌లో వినూత్నమైన స్పేస్‌-థీమ్‌లపై పోస్టర్లు, అంతరిక్ష ఆధారిత ఫొటో ఎగ్జిబిషన్‌, పెయింటింగ్‌, క్విజ్‌ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనడానికి రాష్ట్రంలోని 424 పాఠశాలల నుంచి వేలాదిమంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటీహెచ్‌ అధికారులు విద్యార్థులకు అంతరిక్ష ప్రాముఖ్యతను తెలిపేందుకు కొన్ని లఘు చిత్రాలను ప్రదర్శించారు. చంద్రయాన్‌ రాకెట్‌ ప్రయోగం సక్సె్‌సపై ఇస్రో పరిశోధకులు పనితీరును వివరించారు. ఈ సందర్భంగా మృంత్యుంజయరెడ్డి మాట్లాడుతూ అంతరిక్షంలోకి చంద్రయాన్‌ వెళ్లిన తర్వాత దేశ కీర్తి ఎల్లలు దాటిందని, ప్రజలందరికీ అంతరిక్షం గురించి ఎక్కువ తెలిసిందన్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేదిని ఏమి లేదని, తన మేధాశక్తితో గ్రహాలపై విహరించే స్థాయికి చేరారన్నారు. విద్యార్థులు అంతరిక్షంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:17 PM