స్కాలర్‌షిప్స్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
ABN , Publish Date - Aug 06 , 2024 | 11:37 PM
రామాయంపేట, ఆగస్టు 6: పెండింగ్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలంటూ విద్యార్థిలోకం రోడ్డెక్కింది. మొదట భారీ ర్యాలీగా కదిలొచ్చి పట్టణంలోని పాత హైవేపై రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళనకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మంగళవారం తెరలేపారు.
గంటపాటు పాత హైవేపై బైఠాయింపు
ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
పోలీసులతో ఏబీవీపీ నేతల వాగ్వాదం
బలవంతంగా వ్యాన్ ఎక్కించి స్టేషన్‌కు తరలింపు
రామాయంపేట, ఆగస్టు 6: పెండింగ్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలంటూ విద్యార్థిలోకం రోడ్డెక్కింది. మొదట భారీ ర్యాలీగా కదిలొచ్చి పట్టణంలోని పాత హైవేపై రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళనకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మంగళవారం తెరలేపారు. గత ప్రభుత్వం లాగానే ప్రస్తుత అధికార పార్టీ సైతం విద్యార్థులతో చెలగాటమాడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు వందలాది మంది రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు పెద్దఎత్తున నిలిచి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఆందోళన విరమించమంటూ భీష్మించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ నేతలకు వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థి నేతలను బలవంతంగా వ్యాన్ ఎక్కించి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.