Share News

‘అక్షరమాల’తో నిరుపేద విద్యార్థులకు అండ

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:20 PM

కంది, ఆగస్టు 25 : అక్షరమాల పేరిట ఐఐటీ-హెచ్‌ నిర్వహించే కార్యక్రమంతో నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటున్నామని ఆ సంస్థ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు.

‘అక్షరమాల’తో నిరుపేద విద్యార్థులకు అండ
అక్షరమాల వలంటీర్లకు ప్రశంసా పత్రాలు ఇస్తున్న ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి

ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి

కంది, ఆగస్టు 25 : అక్షరమాల పేరిట ఐఐటీ-హెచ్‌ నిర్వహించే కార్యక్రమంతో నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటున్నామని ఆ సంస్థ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. అక్షరమాల కార్యక్రమం నాలుగో వార్షికోత్సం ఐఐటీ-హెచ్‌లో ఆదివారం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా అకడమిక్‌ కోచింగ్‌, కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు అక్షరమాల ద్వారా వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వలంటీర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతారు. అక్షరమాల ద్వారా ప్రస్తుతం 125 మంది వలంటీర్లు పని చేస్తున్నారు. అక్షరమాల వార్షికోత్సవం సందర్భంగా వలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి.. చదువులో ప్రతిభ కనబరిచిన ఏడుగురు విద్యార్థులకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. అలాగే, ఐఐటీ-హెచ్‌ దత్తత తీసుకున్న మెదక్‌ జిల్లాలోని అంతారం, సలబత్‌పూర్‌, మొహ్మద్‌నగర్‌, కన్నవరం, భుజరంపేట గ్రామల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు, స్ర్కీన్లు అందజేశారు.

Updated Date - Aug 25 , 2024 | 11:20 PM