Share News

ఎండవేడికి బైక్‌ దగ్ధం!

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:47 PM

ఎండవేడికి బైక్‌ దగ్ధమైన సంఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వ్యక్తి తన హోండా యాక్టివాను సంగారెడ్డి పట్టణంలోని ఫ్రైడే మార్కెట్‌ రోడ్డు వద్ద నిలిపాడు. కొద్దిసేపటికి బండి నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఎండవేడికి బైక్‌ దగ్ధం!

సంగారెడ్డి పట్టణంలో ఘటన

ఎండ, పెట్రోల్‌ లీకవ్వడంతోనే ప్రమాదం జరిగినట్లుగా అనుమానం

సంగారెడ్డి క్రైం, ఏప్రిల్‌ 16 : ఎండవేడికి బైక్‌ దగ్ధమైన సంఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వ్యక్తి తన హోండా యాక్టివాను సంగారెడ్డి పట్టణంలోని ఫ్రైడే మార్కెట్‌ రోడ్డు వద్ద నిలిపాడు. కొద్దిసేపటికి బండి నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బైక్‌ పూర్తిగా దగ్ధమైంది. పాతబైక్‌ అవ్వడం, పెట్రోల్‌ లీకవ్వడంతో ఎండవేడికి మంటలు చెలరేగి బైక్‌ దగ్ధమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:47 PM