Share News

కొమురవెల్లిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ABN , Publish Date - Aug 16 , 2024 | 11:10 PM

చేర్యాల, ఆగస్టు 16: కొమురవెల్లి మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవిస్తూ, అవసరాల కోసం విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్‌.శ్రీను తెలిపారు.

కొమురవెల్లిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్‌
విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న సీఐ శ్రీను

చేర్యాల, ఆగస్టు 16: కొమురవెల్లి మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవిస్తూ, అవసరాల కోసం విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్‌.శ్రీను తెలిపారు. శుక్రవారం కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లండించారు. కామారెడ్డికి చెందిన కంకణాల భరత్‌కుమార్‌ కొద్దిరోజులుగా కొమురవెల్లి మండల కేంద్రంలోని వైన్‌షా్‌పలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న కామారెడ్డికి చెందిన చిటికె నాగరాజు తరచూ భరత్‌కుమార్‌ దగ్గరికి వచ్చిపోతున్న క్రమంలో ఫతేనగర్‌ నుంచి గంజాయి తీసుకొచ్చి భరత్‌కుమార్‌కు ఇస్తూ సేవించడంతో పాటు డబ్బుల కోసం ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా కొమురవెల్లికి చెందిన లింగంపల్లి దుర్గయ్యకు అందించేవారని తెలిపారు. శుక్రవారం ముగ్గురూ కలిసి గ్రామశివారులో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నాగరాజు వద్ద 40 గ్రాముల గంజాయి, మొబైల్‌ ఫోన్‌, భరత్‌కుమార్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌, లింగంపల్లి దుర్గయ్య వద్ద గంజాయి సేవించేందుకు తాటి ఆకులతో తయారు చేసిన చిల్లాను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసును పరిశోధించిన ఎస్‌ఐ రాజు, సిబ్బందిని సీఐ అభినందించడంతో పాటు జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ద్వారా రివార్డును అందజేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 11:10 PM