Share News

ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్‌

ABN , Publish Date - Aug 27 , 2024 | 11:13 PM

చిన్నకోడూరు, ఆగస్టు 27: సిద్దిపేట జిల్లాలోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని గ్రామ దేవత ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు.

ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్‌
సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడిస్తున్న సిద్దిపేట ఏసీపీ మధు

7.5 తులాల బంగారు ఆభరణాలు,182 తులాల వెండి వస్తువులు స్వాధీనం

రెండు ద్విచక్ర వాహనాలు సీజ్‌, పరారీలో మరో నిందితుడు

వివరాలు వెల్లడించిన ఏసీపీ మధు

చిన్నకోడూరు, ఆగస్టు 27: సిద్దిపేట జిల్లాలోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని గ్రామ దేవత ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో కేసు వివరాలను మంగళవారం రాత్రి ఆయన వెల్లడించారు. ఇటీవల జిల్లాలోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని గ్రామదేవత ఆలయాల్లో తరచూ చోరీలు జరుగుతుండటంతో చోరీలను ఛేదించేందుకు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ అనురాధ సిద్దిపేట ఏసీపీ మధు ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్‌ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్‌ఐ బాలకృష్ణ, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అసిఫ్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, సిబ్బందితో ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు చేశారు. కేసుల పరిశోధనలో భాగంగా టెక్నాలజీ, సీసీ కెమెరాల ఆధారంగా ఆధారాలు స్వీకరించి మంగళవారం ఉదయం సిద్దిపేట రూరల్‌ సీఐ శ్రీను, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో రాజీవ్‌ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన బోదాసు యాదగిరి టీవీఎస్‌ ఎక్సెల్‌ మీద, దూల్మిట్ట మండలానికి చెందిన వల్లేపు శేఖర్‌ (ప్రస్తుత నివాసం సిద్దిపేట పట్టణం ఇందిరమ్మ కాలనీ) బైక్‌పై సిద్దిపేట నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారించగా పలు ఆలయాల్లో చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్ద నుంచి 7.5 తులాల బంగారు ఆభరణాలు, 182 తులాల వెండి వస్తువులు, రెండు ద్విచక్ర వాహనాలు మొత్తం రూ.7 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా మరో నిందితుడు కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కొమిరె శ్రీనివాస్‌ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిద్దిపేట రూరల్‌ సీఐ శ్రీను, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, చిన్నకోడూరు ఎస్‌ఐ బాలకృష్ణ, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అసిఫ్‌, సీసీఎస్‌, పోలీసు సిబ్బందిని ఏసీపీ మధు అభినందించారు. త్వరలో సీపీకి రివార్డు ప్రపోజల్‌ పంపిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Aug 27 , 2024 | 11:13 PM