Share News

రాజస్థాన్‌ ప్రభుత్వ అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా ఉదయ్‌కుమార్‌సాగర్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:39 PM

నారాయణఖేడ్‌, ఆగస్టు 21: రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన శెట్టి ఉదయ్‌కుమార్‌సాగర్‌ను నియమిస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కుమార్‌జైన్‌ ఉత్తర్వులు జారీచేశారు.

రాజస్థాన్‌ ప్రభుత్వ అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా ఉదయ్‌కుమార్‌సాగర్‌

నారాయణఖేడ్‌, ఆగస్టు 21: రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన శెట్టి ఉదయ్‌కుమార్‌సాగర్‌ను నియమిస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కుమార్‌జైన్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఉదయ్‌కుమార్‌ సాగర్‌ నారాయణఖేడ్‌ డివిజన్‌లోని నాగల్‌గిద్ద మండలం గూడురుకు చెందిన దివంగత న్యాయవాది మాధవరావుసాగర్‌ కుమారుడు. ఉదయ్‌కుమార్‌సాగర్‌ న్యాయవాద పట్టా పొందగానే సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన హర్యానా ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌గా, సెంట్రల్‌ క్రికెట్‌ బోర్డు అడ్వకేట్‌ ఆన్‌రికార్డుగా, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ ఏజెన్సీ ప్యానెల్‌లోను పనిచేస్తున్నారు. బొట్వ్సాన దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదించడానికి అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా కూడా ఆ ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతంలో జన్మించిన శెట్టి ఉదయ్‌కుమార్‌సాగర్‌ను రాజస్థాన్‌ ప్రభుత్వం అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా నియమించడం పట్ల ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:39 PM