Share News

బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:04 AM

వర్గల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి

బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రామకృష్ణారెడ్డి

వర్గల్‌, జూన్‌ 2: గ్రామీణ ప్రాంతాల రైతులు, ప్రజలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వర్గల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇర్రి రామకృష్ణరెడ్డి కోరురు. వర్గల్‌ మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలో ఇంటింటికీ డీసీసీ బ్యాంకు డిపాజిట్‌ సేకరణ వాల్‌ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు, రైతులు బ్యాంకు ఖాతాలు తెరచినట్లయితే రూ. 2లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. పది సంవత్సరాలలోపు పిల్లలకు సహకార బచ్‌పన్‌ భరోసా డిపాజిట్‌ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే తక్కువ వడ్డికి బంగారు రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు. డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఉంటుందన్నారున్నారు. రైతులు, ప్రజలు ప్రైవేట్‌ వడ్డి వ్యాపారులు, ఫైౖనాన్స్‌లను ఆశ్రయించి నష్టపోవద్దని, సహకార బ్యాంక్‌ను ఆశ్రయించాలన్నారు. కార్యక్రమంలో వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌, ఎంపీపీ జాలిగామ లతారమేశ్‌గౌడ్‌, బ్యాంకు మేనేజర్‌ నర్సింహరెడ్డి. సిబ్బంది యమున, పీఏసీఎస్‌ సీఈవో జితేందర్‌రెడ్డి, మండల కోఅప్షన్‌ సభ్యులు మహ్మద్‌ ఫారుఖ్‌, శ్రీకాంత్‌, ఫయాజ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:04 AM