Share News

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - May 17 , 2024 | 11:55 PM

రైతులు ఆందోళన చెందొద్దు సిద్దిపేట డీఎ్‌సవో తనూజ

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
గజ్వేల్‌: జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులతో మాట్లాడుతున్న డీఎస్‌వో తనూజ

గజ్వేల్‌, మే 17: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ తెలిపారు. గజ్వేల్‌ మండల పరిధిలోని జాలిగామ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూసుకుంటున్నామని అన్నారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వారివెంట కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు, రైతులు ఉన్నారు.

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ములుగు/నారాయణరావుపేట, మే 17: రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ.. వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ములుగు మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయిందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వరిధాన్యానికి 500 బోనస్‌ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న ధాన్యానికే బోనస్‌ ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బీఆర్‌స్‌ తరఫున రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. నారాయణరావుపేట మండలంలో ఐకేపీ, పీఏసీఎ్‌సల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రమే్‌షగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారటు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అల్లాడుతున్నారన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి సివిల్‌ సప్లైయ్‌ అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు చెప్తున్నారే తప్పా అచరణలో పాటించడం లేదని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండిచింన పంట వెంటనే ధాన్యం కొనుగోళు చేయకపోతే రైతులను సంఘటితం చేసి అందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్షి శ్రీకాంత్‌గౌడ్‌, నాయకులు మునిగెల స్వామి, ప్రతా్‌పరెడ్డి, భూమయ్య, ఏల్లం కుమార్‌, ఆశోక్‌, సుధాకర్‌, బిక్షపతి పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 11:55 PM