మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - Aug 13 , 2024 | 11:41 PM
జగదేవ్‌పూర్, ఆగస్టు 13: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు.
మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణి
జగదేవ్‌పూర్, ఆగస్టు 13: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని పీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పాత పంటల సాగు, జీవవైవిధ్య పంటల సాగుపై మహిళలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇష్టమైన రంగంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా 100 మంది మహిళలకు ఈ ఆటో కార్యక్రమం ద్వారా ఎనిమిది వారాల పాటు ప్రత్యేకంగా ఎలక్ర్టిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ అందించి, వారికి త్వరలోనే ఎలక్ర్టిక్ ఆటోలు సైతం అందించనున్నట్లు తెలిపారు. జగదేవ్‌పూర్ ప్రాంతంలో త్వరలోనే ఈ ఆటో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య, అరుణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కవితారెడ్డి, అమర రాము, పీస్ సిబ్బంది మహేష్, పద్మ, వెంకట్‌లక్ష్మి, శోభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగదేవ్‌పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని కొండపోచమ్మ అమ్మవారిని శోభారాణి దర్శించుకున్నారు.