Share News

సెక్స్‌ వర్కర్ల సంక్షేమం కోసం కృషి

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:37 PM

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 31: సెక్స్‌ వర్కర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా శాంతియుత సమాజాన్ని నిర్మించేందుకు న్యాయవాదులు, పోలీసులు, వివిధ సంఘాల నాయకులు కృషిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధాకృష్ణ చౌహాన్‌ కోరారు.

సెక్స్‌ వర్కర్ల సంక్షేమం కోసం కృషి
సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధాకృష్ణ చౌహాన్‌

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 31: సెక్స్‌ వర్కర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా శాంతియుత సమాజాన్ని నిర్మించేందుకు న్యాయవాదులు, పోలీసులు, వివిధ సంఘాల నాయకులు కృషిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధాకృష్ణ చౌహాన్‌ కోరారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో శనివారం సెక్స్‌ వర్కర్ల హక్కులపై సంగ్రామ్‌ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్స్‌ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కమిటీ చేసిన సిఫార్సుల గురించి వివరించారు. శాంతిభద్రతల విధివిధానాల్లో విద్య ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావు మాట్లాడుతూ వేశ్య వృత్తి యుగయుగాలుగా కొనసాగుతుందని, ఈ వృత్తిలో ఉన్న మహిళలకు ఇతర జీవనోపాధి చూపించి వారి జీవన విధానాల్లో మార్పు కోసం పోలీసుశాఖ కృషి చేస్తున్నదన్నారు. జిల్లా మహిళా శిశుశాఖ అధికారి లలితకుమారి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్‌, హిజ్రాల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ జ్యోతి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు అవంతిక తంగెళ్లతో పాటు పోలీసు, విద్యాశాఖ అధికారులు, సఖి కేంద్రం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:37 PM