Kavitha: ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్
ABN , Publish Date - Jan 17 , 2024 | 06:59 PM
మ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కవిత సామాజిక మాధ్యమాల వేదికగా వివరించారు. తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఆమె వివరించారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కవిత సామాజిక మాధ్యమాల వేదికగా వివరించారు. తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఆమె వివరించారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 11 గంటలవరకు వరుసగా హ్యాకింగ్‌కి ప్రయత్నించారు.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సంబంధం లేని ఓ వీడియో పోస్టు చూసిన కవిత వెంటనే అప్రమత్తం అయ్యారు. హ్యాక్ విషయాన్ని గుర్తించారు. ఎక్స్‌లో తన పోస్ట్‌ని డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్లను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.