Share News

ఆపరేషన్‌ చబూత్రలో 103 మంది అదుపులోకి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:33 AM

అకారణం గా రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టప్రకా రం కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి హెచ్చరించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నల్లగొండ పట్టణంలో వన్‌టౌన్‌, టూ టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ఆపరేషన్‌ (చబూత్ర) నిర్వహించారు.

ఆపరేషన్‌ చబూత్రలో 103 మంది అదుపులోకి

90 బైక్‌లు, ఆరు కార్లు, రెండు ఆటోలు, 58 సెల్‌ఫోన్లు స్వాధీనం

73 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు

డీఎస్పీ కొలను శివరాంరెడ్డి

నల్లగొండ క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అకారణం గా రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టప్రకా రం కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి హెచ్చరించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నల్లగొండ పట్టణంలో వన్‌టౌన్‌, టూ టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ఆపరేషన్‌ (చబూత్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగులపై కూర్చుని బా తకానీలు కొట్డడంతో పాటు రోడ్లపై ఇష్టానుసారంగా బైక్‌లపై తిరుగుతూ కాలనీ వాసులకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. నల్లగొండ పట్టణాన్ని జల్లెడ పట్టామని, యాంటినార్కోటిక్స్‌ స్నిప్పర్‌ డాగ్‌ సహాయంతో విస్తృత తనిఖీ లు నిర్వహించామన్నారు. రోడ్లపై అవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 103 మందిని అదుపులోకి తీసుకు ని కౌన్సిలింగ్‌ నిర్వహించామన్నారు. అలాగే వారి నుంచి 90 బైక్‌లు, ఆరు కార్లు, రెండు ఆటోలు, 58 సెల్‌ఫోన్లను స్వాధీ నం చేసుకుని 73 మందిపై డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు నమోదు చే శామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాతకానీలు కొడుతూ బైక్‌లపై ఇష్టానుసారంగా తిరిగినా, కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగించినా, గొడవలు సృష్టించినా ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. 31న స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. యాక్సిడెంట్‌ ఫ్రీ, ఇన్సిడెంట్‌ ఫ్రీ నల్లగొండగా చేయాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రాజు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:33 AM