‘గృహజ్యోతి’కి 1.47 లక్షల మంది అర్హులు
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:01 AM
జిల్లాలో 1,47,371 లక్షల మంది గృహజ్యోతి పథకానికి అర్హులు ఉన్నారని, మార్చి 1 నుంచి 200 యూనిట్ల లోపు బిల్లులు వచ్చిన వారికి గృహజ్యోతి పథకం అమలవుతోందని జిల్లా విద్యుత శాఖ ఎస్‌ఈ పాల్‌రాజ్ తెలిపారు.
భానుపురి, ఫిబ్రవరి 27 : జిల్లాలో 1,47,371 లక్షల మంది గృహజ్యోతి పథకానికి అర్హులు ఉన్నారని, మార్చి 1 నుంచి 200 యూనిట్ల లోపు బిల్లులు వచ్చిన వారికి గృహజ్యోతి పథకం అమలవుతోందని జిల్లా విద్యుత శాఖ ఎస్‌ఈ పాల్‌రాజ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఎంపీడీవో, మునిసిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ధ్రువీకరణ కార్డును సూర్యాపేట విద్యుత కార్యాలయంలో అందజేయాలన్నారు. జిల్లాలో 2,76,629 గృహ విద్యుత సర్వీసులు ఉన్నాయన్నారు. రేషనకార్డు, ఆధార్‌కార్డు, మొబలై నెంబరు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవకాశాన్ని అర్హులైన విద్యుత వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట డీఈలు శ్రీనివాస్, దాలినాయుడు, సత్యనారాయణ, ఏడీఈ శ్రీనివా్‌సరెడ్డి, ఉదయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు.