కిలో.. 300
ABN , Publish Date - Apr 11 , 2024 | 12:14 AM
చికెన్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి.మాంసం రేటు ఎక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇంటికి బంధువులొచ్చినా, పండగలొచ్చినా చికెన్‌తోనే సరిపెట్టుకుంటారు.

కొండెక్కిన చికెన్ ధరలు
కార్పొరేట్ కంపెనీల మాయాజాలం
ఉత్పత్తి తగ్గడం, పెళ్లిళ్లు, ఎన్నికల సీజన్ కావడమే కారణం
మోత్కూరు: చికెన్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి.మాంసం రేటు ఎక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇంటికి బంధువులొచ్చినా, పండగలొచ్చినా చికెన్‌తోనే సరిపెట్టుకుంటారు. కొంతమంది వారానికో సారి చికెన్ తెచ్చుకుంటుండగా, మరి కొందరు 15, 20 రోజులకో సారి తెచ్చుకుంటారు. చికెన్ కిలో రూ.300 చేరడంతో ఆ మాత్రం కూడా అందుబాటులో లేకుండా పోయింది.
రైతుల వద్ద కోళ్లు ఉన్నప్పుడు కార్పొరేట్ సంస్థలు రేటు తగ్గించడం, రైతుల వద్ద కోళ్లు లేనప్పుడు కార్పొరేట్ సంస్థలు రేటు పెంచడం మామూలైంది. ఇప్పుడు రాష్ట్రంలోనూ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నూ కోళ్ల ఉత్పత్తి (పెంపకం) తగ్గింది. రైతుల వద్ద కోళ్లులేవు.పైగా మహారాష్ట్రలో కోళ్ల కొరత ఏర్పడి చికెన్‌కు బాగాడిమాండ్ ఉంది. తెలంగాణ కన్నా మహారాష్ట్రలో రేటు ఎక్కువగా ఉండటంతో కోళ్లను అక్కడికి ఎగుమతి చేస్తున్నారంటున్నారు. దీంతో కార్పొరేట్ కంపెనీలు కోళ్ల ధరను బాగా పెంచారు. దీంతో ఇక్కడ రోజురోజుకూ చికెన్ ధర పెరుగుతోంది.
జనవరిలో నష్టాలతో కోళ్లు పెంచని రైతులు
జనవరి, ఫిబ్రవరి మొదటి వారంలో కోళ్ల (ఫాం) రేటు రూ.70 నుంచి రూ.80 మాత్రమే ఉంది. ఈ రే టు రైతుకు గిట్టుబాటు కాదు. ఈ రేటుకు విక్రయి స్తే ఒక్కో కోడిపై రూ.50 నుంరి రూ.60 నష్టం వ స్తుంది. 5వేల కోళ్లు పెంచే రైతుకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షలు నష్టం వస్తుందని చెబుతున్నా రు. రేటు పెరగకుంటే నష్టం వస్తుందని, వేసవిలో కోళ్లు సరిగా ఎదగవని, ఎండ తీవ్రతకు తట్టుకోలేక చనిపోతాయన్న భయంతో రైతులు కోళ్లు పెంచలే దు. కార్పొరేట్ సంస్థలు మాత్రమే కోళ్లు పెంచాయి. వేసవికావడంతో కోళ్లు అనుకుంత ఎదగలేదు. దీంతో కోళ్ల కొరత ఏర్పడింది. పైగా పెళ్లిళ్లు, ఉగాది, రంజాన్ పండుగల సీజన్, పార్లమెంటు ఎన్నికలు కూడా రావడంతో చికెన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. ఇది లా ఉంటే పట్టణాలు, మండల కేంద్రాల్లోనే రూ.270 ధర ఉంది. గ్రామాల్లో ఇంకో పది రూపాయలు ఎక్కువే విక్రయిస్తున్నారు. మున్ముందు ధర ఇంకా పెరగవచ్చని చికెన్ దుకాణాదారులు చెబుతున్నారు.
ధర పెరుగుదలతో కొనలేక పోతున్న ప్రజలు
గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య జనం రోజు విడిచి రోజో, వారానికోసారో తినరు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడో, ఏదైనా కార్యం జరిగినప్పుడో మ టన్‌గాని,చికెన్‌గాని తెచ్చుకుంటారు. గ్రామాల్లో యాటలు కోసే వారు లేక మటన్ ఎక్కువగా దొరకదు. అప్పుడో, ఇప్పుడో దొరికినా కిలో రూ.800 నుం చి రూ.850 అమ్ముతారు. కోసింది మంచిదో, రోగమొచ్చిందో తెలియ దు. చికెన్‌ధర తక్కువగా ఉంటుందని,గ్రామాల్లోని సామాన్య ప్రజలు మాంసం కొనలేక చికెన్‌తోనే సరిపెట్టుకుంటారు. ఇప్పుడు ధరలు బాగా పెరగడంతో చికెన్ కూడా తెచ్చుకోలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ధర పెరిగి చికెన్ కొనలేక పోతున్నాం : పూసపల్లి వెంకన్న, కొత్తగూడెం
మాంసం ధర ఎక్కువగా ఉండటం తో పదిహేను రోజులో ఒకసారి చికెన్ తెచ్చుకునే వారం. ఇప్పుడు చికెన్ ధర కూడా మండిపోతున్నది. చికెన్ ధర కిలో రూ.300 కావడంతో చికెన్ కొనలేక పోతున్నాం. నెల రోజులుగా చికెనే తెచ్చుకోలేదు.
ఈ నెలలో చికెన్ ధరలు
తేది విత్‌స్కిన్ స్కిన్‌లె్‌స
3న 226 246
4న 230 260
5న 240 270
6న 260 290
8న 270 300
9న 270 300
10న 270 300