Share News

పట్టభద్రుల ఓటుకు 4.30లక్షల దరఖాస్తులు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:49 PM

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మంగళవారం సాయంత్రం వరకు ఓటు నమోదుకు 4.30లక్షలు దరఖాస్తులు వచ్చాయి.

పట్టభద్రుల ఓటుకు 4.30లక్షల దరఖాస్తులు

తగ్గిన ఓటర్లుగతంతో పోలిస్తే 70వేలు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్ర ఓటర్లకు ముగిసిన దరఖాస్తులు

నల్లగొండ, ఫిబ్రవరి 6: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మంగళవారం సాయంత్రం వరకు ఓటు నమోదుకు 4.30లక్షలు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ఎలక్షన సెల్‌ను ఏర్పాటుచేయగా, జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు 4.30లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఎలక్షన సెల్‌ అధికారి సమాచారమిచ్చారు. రాత్రి 12గంటల వరకు కూడా ఆనలైనలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఈ మూడు జిల్లాల్లో మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశాలున్నాయి. మంగళవారంతో దరఖాస్తుల గడువు ముగిసినప్పటికీ ఓటు నమోదుకు మళ్లీ గడువు పెంచుతారా? లేదా? చూడాల్సి ఉంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 5.05లక్షల ఓటర్లు ఉండగా ఈసారి 70వేలకుపైగా ఓటర్లు తగ్గారు. గతంలో ఓటు వేసిన వారు కూడా తిరిగి మళ్లీ ఓటుకోసం దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే ఓటు హక్కు ఉండదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయినప్పటికీ ఓటు నమోదు చేసుకోవడానికి చాలామంది పట్టభద్రులు ఆసక్తి చూపలేదు.

Updated Date - Feb 06 , 2024 | 11:49 PM