మూత్రవిసర్జనకు రైలు దిగిన బాలుడు
ABN , Publish Date - Jan 31 , 2024 | 11:55 PM
మూత్రవిసర్జన కోసం రైలు నుంచి దిగిన బాలుడిని బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వే పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తిరిగి వచ్చేసరికి వెళ్లిపోయిన రైలు
దర్యాప్తు చేసి అక్కకు అప్పగించిన రైల్వే పోలీసులు
భువనగిరి టౌన, జనవరి 31: మూత్రవిసర్జన కోసం రైలు నుంచి దిగిన బాలుడిని బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వే పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన రాజు భార్య శివాద్రి అనారోగ్యానికి గురికావడంతో వైద్యచికిత్సల నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.భార్యతో పాటు భర్త కూడా ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తల్లిని చూసేందుకు బుధవారం కొత్తగూడెం నుంచి వారి పిల్లలు లోకేష్(13), జియాద్రి(16) కాకతీయ రైలులో బయలుదేరారు. ఈ క్రమంలో రైలు భువనగిరి రైల్వేస్టేషనకు చేరుకున్న వెంటనే లోకేష్ మూత్రవిసర్జన కోసం దిగాడు. తిరిగి రైలు వద్దకు చేరుకునే లోపే రైలు వెళ్లిపోయింది. దీంతో లోకేష్ ఆందోళనగా రైల్వే ఫ్లాట్‌ఫాంపై తిరుగుతుండగా గమ నించిన రైల్వేపోలీసులు ఆరాతీశారు. అతడు చెప్పిన ఫోన నెంబర్ ఆధారంగా రైలులో వెళ్తున్న జియాద్రికి ఫోన చేశారు. అప్పటికే తమ్ముడి కోసం రైలులో వెతుకుతున్న జియాద్రి రైల్వే పోలీసుల నుంచి వచ్చిన ఫోన సమాచారం ఆధారంగా బీబీనగర్ రైల్వే స్టేషనలో దిగి రోడ్డు మార్గంలో భువనగిరి రైల్వేస్టేషనకు చేరుకుంది. అప్పటికే రైల్వే పోలీసులు చైల్డ్ లైన టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారమిచ్చారు. లోకే్‌షను, జియాద్రిని వేర్వేరుగా విచారించి ఇరువురు అక్కాతమ్ముడిగా నిర్ధారించుకున్నారు. అనంతరం లోకే్‌షను ఆర్‌పీఎఫ్ ఏఎ్‌సఐ మోయినోద్దీన ఉమెన, జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణారావు, సత్యనారాయణ, చైల్డ్ లైన కోఆర్డినేటర్ దశరథ తదితర అధికారులు సిబ్బంది అక్క జియాద్రికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.