పౌతీ రిజిస్ర్టేషనకు రూ.30వేలు లంచం
ABN , Publish Date - Feb 09 , 2024 | 12:00 AM
వ్యవసాయ భూమిని ఫౌతీ రిజిస్ర్టేషన చేసేందుకు రూ.30వేలు లంచంగా తీసుకుంటున్న రెవెన్యూ ఇనస్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్‌ఐను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 8: వ్యవసాయ భూమిని ఫౌతీ రిజిస్ర్టేషన చేసేందుకు రూ.30వేలు లంచంగా తీసుకుంటున్న రెవెన్యూ ఇనస్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ సంఘటన జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఎంవీ శ్రీనివా్‌సరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి మండలం కేశ్యతండాకు చెందిన బాణావత లచ్చుకు వరుసకు పెద్దమ్మ, పెద్దనాన్న అయిన బాణావత హన్మా, బాణావత మంగ్లీలు కోల్‌ముంతలపహాడ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తెలు దేవి, అచ్చాలుకు వివాహం అయిన అనంతరం హన్మా, మంగ్లీ దంపతుల బాధ్యతలను లచ్చు చూసుకునేవాడు. హన్మా, మంగ్లీలకు కోల్‌ముంతలపహాడ్ గ్రామంలోని ఎకరం భూమి ఉంది. దంపతులిద్దరూ రెండేళ్లక్రితం అనారోగ్యంతో మృతి చెందారు. రూ.50లక్షలు విలువచేసే ఎకరం పొలాన్ని లచ్చు పేరిట రిజిస్ర్టేషన చేయించుకునేందుకు వారి కుమార్తెలు దేవి, అచ్చాలు అంగీకరించారు. దీంతో లచ్చు రెండు నెలల క్రితం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఎకరం భూమి తన పేరిట పట్టా చేసేందుకు రెవెన్యూ ఇనస్పెక్టర్ శ్రీనివాసరెడ్డి రేపు మాపు అంటూ తిప్పుతున్నాడని బాధితుడు వాపోయాడు. ఈ క్రమంలో ఆర్‌ఐ రూ.60వేలు డిమాండ్ చేయగా, రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 15 రోజుల క్రితం లచ్చు ఏసీబీ అధికారులను సంప్రదించి పరిస్థితిని వివరించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు లచ్చు గురువారం రెవెన్యూ ఇనస్పెక్టర్ శ్రీనివా్‌సరెడ్డికి ఫోనచేసి డిండి ఎక్స్‌రోడ్డు వద్దకు రావాలని కోరాడు. దీంతో తన కారులో డిండి చౌరస్తాకు వచ్చిన శ్రీనివాసరెడ్డి లచ్చు నుంచి రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఎంవి.శ్రీనివా్‌సరావు ఆధ్వర్యంలో సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రివెన్షన ఆఫ్ కరప్షన యాక్ట్ కింద ఆర్‌ఐపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివా్‌సరావు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే సెల్ 9154388918, 9154388920, 9154388921తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సోదాల్లో ఏసీబీ ఇనస్పెక్టర్ బి.వెంకటేశ్వర్‌రావు, బి.రామారావు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీధర్, సిబ్బంది ఉన్నారు. కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ అనంతరం ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపెట్టనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.