Share News

పకడ్బందీగా కుటుంబ సర్వేచేపట్టాలి

ABN , Publish Date - Oct 30 , 2024 | 01:02 AM

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుం బ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంటిం టి కుటుంబ సర్వేపై మంగళవారం ఆయన మధిర తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

పకడ్బందీగా కుటుంబ సర్వేచేపట్టాలి

సర్వేతో ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు

కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భువనగిరి కలెక్టరేట్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుం బ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంటిం టి కుటుంబ సర్వేపై మంగళవారం ఆయన మధిర తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ విధి విధానాలను కేబినెట్‌ సమావేశాల్లో చర్చించి ఆమోదించామని, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల వివరాలను సర్వే ద్వారా సేకరిస్తామని అన్నారు. అందుకు అవసరమైన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను గుర్తించి అవసరమైన శిక్షణ ఇచ్చి గ్రామం, మండలం, జిల్లాస్థాయి ప్రభుత్వాధికారులను ఎంపిక చేయాలని సూచించారు. సీఆర్‌పీ, గెస్ట్‌ టీచర్ల సేవలు వినియోగించుకోవచ్చునని సూచించారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ ఉండేలా చూడాలని చెప్పారు. సర్వే నిర్వహణకు ప్రతీ మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించాలన్నారు. సర్వే షెడ్యుల్‌ వివరాలు ప్రజలకు చేరేలా ప్రచారం నిర్వహించి, వచ్చే నెల 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.

అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలి

బలహీన వర్గాలు, అట్టడుగు పేద ప్రజలందరికీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గంగాధర్‌, జి.వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, ఎల్‌.యశోద, డీఎ్‌ఫవో పద్మజరాణి, జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 01:02 AM