Share News

నాగారంలో రూ.2 కోట్లతో గెస్ట్‌హౌస్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:27 AM

నాగారంబంగ్లాలో సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై అత్యాధునిక హంగులతో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

నాగారంలో రూ.2 కోట్లతో గెస్ట్‌హౌస్‌
ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద నాయకులతో మాట్లాడుతున్న వెంకట్‌రెడ్డి

ప్రతిపాదనలు పంపించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

నాగారం, జూలై 4 : నాగారంబంగ్లాలో సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై అత్యాధునిక హంగులతో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం జనగాం జిల్లాలో జరిగిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నల్లగొండకు వెళుతూ మార్గమధ్యలో నాగారంబంగ్లా గెస్ట్‌హౌస్‌ వద్ద కార్యకర్తల కోరిక మేరకు కాసేపు ఆగారు. నాగారంబంగ్లా వద్ద నిజాం కాలంలో నిర్మించిన రహదారి బంగ్లా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే నడుచుకుంటూ వెళ్లి రహదారి బంగ్లాను పరిశీలించారు. తక్షణమే నూతన గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే నాగారం మండలంలో అన్నిగ్రామాల్లో పర్యటించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆగస్టు 15లోపే రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి అన్నారు. నాగారంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఏడు ఎకరాల్లో ఫాంహౌ్‌సను వరద నీరు వెళ్లకుండా ఊరికి అడ్డంగా నిర్మించి గ్రామం ముంపునకు కారకుడయ్యడని మంతి విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాశం యాధవరెడ్డి, దోనకొండ రమేష్‌, ఓరుగంటి సత్యనారయణ, గుంటకండ్ల ముకుందారెడ్డి, బిక్కి శ్రీను, కడారి సోమయ్య, కొంపెల్లి శ్రీనివాస్‌, జాజుల వీరయ్య, గుడిపెల్లి మధుకర్‌రెడ్డి, కన్నెబోయిన రాంమూర్తి, వెంకటభిక్షం, యాకస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:27 AM