Share News

బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాస్తున్న కేంద్రం

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:13 AM

బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వీరయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో టీఎ్‌సయూటీఎఫ్‌ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభ లు రెండో రోజుకు చేరుకున్నాయి.

బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాస్తున్న కేంద్రం

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వీరయ్య

నల్లగొండ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వీరయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో టీఎ్‌సయూటీఎఫ్‌ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభ లు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు వనరులు లేవని తప్పుకుంటున్నాయన్నారు. ప్రభుత్వ విద్య కేవలం ఉపాధ్యాయులది మాత్రమేనని, తమ బాధ్యత కాదని, ఉపాధ్యాయులను దోషులుగా నిలబెడుతున్నాయన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించకుండా తప్పించుకుంటున్నాయని, నేటి సమాజం లో కేవలం పేదల బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనాథలుగా భావిస్తున్నాయన్నా రు. ఏడాది కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, బలహీనవర్గాలకు ఏమి చేసిందో చెప్పాలన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అదాని ఆస్తులు అమాంతం పెరిగాయన్నారు. సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌.రాములు, రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌ రెడ్డి, కె.సోమశేఖర్‌, ఎ.వెంకట్‌, డి.సత్యానంద్‌, జి.నాగమణి, వై.జ్ఞానమందరి, రాజు, రవి, ప్రసాద్‌, రవికుమార్‌, శాంతకుమారి, టీఎ్‌సయుటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్క శ్రీనివాసచారి, పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా ఉపాధ్యాక్షురాలు బడుగు అరుణ, నర్ర శేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, నలపరాజు వెంకన్న పాల్గొన్నారు.

బడ్జెట్‌లో విద్యకు నిధులు పెంచాలి: నర్సిరెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో విద్యకు నిధులు పెంచాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 15శాతం, కేంద్ర బడ్జెట్‌లో 5నుంచి 6శాతం నిధులు కేటాయించాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూలో క్వాలిటీ పెంచాలన్నారు.

యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ పాఠశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరగాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో టీఎ్‌సయూటీఎఫ్‌ అధ్యక్షుడు బక్క శ్రీనివాసచారి, ప్రధా న కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:13 AM