Share News

వాస్తవాల ఆధారంగా నివేదికను రూపొందించాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:54 AM

రామన్నపేటలో ప్రతిపాదించిన అదాని అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన వారందరూ వ్యతిరేకత తెలిపారని, ఆ మేరకు వాస్తవ నివేదికనే రూపొందించాలని రామన్నపేట మండలంలో అఖిలపక్షాల నాయకులు కలెక్టర్‌ హనుమంతు కె జెండగేను కోరారు.

 వాస్తవాల ఆధారంగా నివేదికను రూపొందించాలి

ఎసెన్షియల్‌ రిపోర్టును బహిరంగ పరచాలి

కలెక్టర్‌కు అఖిలపక్షాల వినతి

రామన్నపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి)ః రామన్నపేటలో ప్రతిపాదించిన అదాని అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన వారందరూ వ్యతిరేకత తెలిపారని, ఆ మేరకు వాస్తవ నివేదికనే రూపొందించాలని రామన్నపేట మండలంలో అఖిలపక్షాల నాయకులు కలెక్టర్‌ హనుమంతు కె జెండగేను కోరారు. ఈ మేరకు గురువారం భువనగిరిలోని కలెక్టరేట్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎసెన్షియల్‌ కమిటీకి పంపే నివేదికను బహిరంగ పర్చాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన 10వేల మంది ముక్తకంఠంతో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించాలని వివరించారు. పరిశ్రమ ఏర్పాటుతో పరిసరాలన్నీ కలుషితమవడంతో పాటు ప్రజా రోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎండీ.జహంగీర్‌, మేక అశోక్‌రెడ్డి, గంగుల రాజిరెడ్డి, సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జెల్లెల పెంటయ్య, ఎండీ.రేహన, పల్లపు దుర్గయ్య, ఊట్కూరి నర్సింహ, బొడ్డుపల్లి వెంకటేశం, గోదాసు పృథ్వీరాజు, ఫజల్‌ బేగ్‌, జమీరొద్దీన, ఎండీ.అక్రమ్‌, నకిరెకంటి నరేందర్‌, బావాండ్లపల్లి బాలరాజు, నోముల రాజు తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్‌ ఫ్యాక్టరీకి అనుమతులివ్వొద్దు : చిరుమర్తి

ప్రజారోగ్యం, పర్యావరణం, వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రామన్నపేటలో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు. గురువారం రామన్నపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులను అడ్డుకుని దూర ప్రాంతాల ప్రజలకు బిర్యానీలు, మందు తదితర ప్రలోభాలకు గురి చేసి తూ తూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేశారని ఆరోపించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రజలతో కలిసి బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటుందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్‌ వైస్‌చైర్మన కంభంపాటి శ్రీనివాస్‌, మాజీ సర్పంచలు మర్రి జలేందర్‌రెడ్డి, మెట్టు మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్‌, దోమల సతీష్‌, గొరిగె నర్సింహ, బాలగోని నరసింహ, ఎండీ. అమెర్‌, నాయకులు సంతోష్‌, కర్నెబోయిన బలరాం, కూనూరు ముత్తయ్య, మల్లేశం, రాము, శివ, విక్రమ్‌ పాల్గొన్నారు.

కాలుష్య కరక అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయంలో ప్రాంత ప్రజలు ఐక్యమత్యంతో పోరాడి వ్యతిరేక నిరసనలు వ్యక్తంచేయడం అభినందనీయమని పీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం పట్ల మాజీ ఎమ్మెల్యే కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడడం, చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. వరికల్‌ గోపాల్‌ప్రజాపతి, నన్నూరి శంకర్‌రెడ్డి, బొడ్డు శంకర్‌, బొడ్డు వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:54 AM